గౌతమ్‌ సింఘానియా నవాజ్‌ మోడీపై దాడి చేసింది నిజమేనా?

14 Nov, 2023 13:55 IST|Sakshi

వ్యాపార ప్రపంచంలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌ మోడీ సింఘానియాతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే, గౌతమ్‌ సింఘానియా ప్రకటన చేసిన కొన్ని గంటలకే నవాజ్‌ మోడీ తన అత్తమామలతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన అత్తమామలకు ‘అన్ని సమయాల్లో వారి అపరిమితమైన మద్దతు, ప్రేమ, దయ, సహాయానికి’ ధన్యవాదాలు తెలిపే వీడియోను షేర్ చేశారు. 

వీడియోలో, 53 ఏళ్ల నవాజ్ సోఫాలో కూర్చుని మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొంటున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు. పూజ సమయంలో ఆమె ఒక వాకింగ్ స్టిక్ సహాయంతో హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తున్నారు. నవాజ్‌ మోడీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోల్ని నిశితంగా పరిశీలిస్తే.. గౌతమ్‌ సింఘానియాపై ఆమె చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 

కాలర్‌ బోన్‌ విరిగేలా కొట్టి
తాజాగా తన భర్త గౌతమ్‌ సింఘానియా మహరాష్ట్ర థానే జిల్లాలో జేకే గ్రామ్‌లోని ఓ ప్రాపర్టీలో నిర్వహించిన దీపావళికి హాజరు కానివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత నెలలో ముంబైలో విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన బ్రీచ్‌ క్యాండీ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో గౌతమ్‌ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో కాలర్ బోన్ విరిగిందన్నారు.  

అయితే పూజ సమయంలో నవాజ్‌ మోడీ వాకింగ్ స్టిక్ సహాయంతో హోమం చుట్టూ ప్రదక్షిణ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవ్వడం ఆమె చేసిన ఆరోపణలు నిజమనేలా ఉన్నాయని వ్యాపార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి  

A post shared by Nawaz Modi Singhania (@nawazbodyartmumbai)

మరిన్ని వార్తలు