తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి - ఈ రోజు కొత్త ధరలు ఇలా..

16 Dec, 2023 15:18 IST|Sakshi

గత రెండు రోజులుగా ఏకంగా రూ. 1100 నుంచి రూ. 1200 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 450 నుంచి రూ. 490 వరకు తగ్గాయి. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 450 నుంచి రూ. 460 వరకు తగ్గింది. అంటే ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57,300 (22 క్యారెట్స్), రూ. 62,510 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి.

చెన్నైలో రెండు రోజుల్లో రూ.1300 నుంచి రూ.1400 వరకు పెరిగిన బంగారం ధరలు, ఈ రోజు రూ. 400 నుంచి రూ. 440 వరకు తగ్గాయి. నేడు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5790 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6314కి చేరింది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 57900, రూ. 63140కి చేరాయి.

ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు రూ. 450 నుంచి రూ. 490 తగ్గాయి. అంటే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,660గా ఉంది.

వెండి ధరలు
గత రెండు రోజుల్లో ఏకంగా రూ. 3500 పెరిగిన వెండి ధరలు ఈ రోజు కేవలం రూ. 800 మాత్రమే తగ్గింది. నేడు కేజీ వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో రూ.79700, చెన్నైలో రూ. 79700, ఢిల్లీలో రూ. 77700గా ఉంది. 

>
మరిన్ని వార్తలు