ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ

15 Dec, 2023 18:28 IST|Sakshi

టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో లెక్కకు మించిన యాప్స్ పుట్టుకొచ్చాయి. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రిక్స్ వంటివి మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు కావాలంటే కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని.. ఉన్న చోటుకే తెప్పించుకుంటున్నారు. యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గురుగ్రామ్‌కు చెందిన 'ప్రణయ్‌ లోయా' స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కొన్ని సరకులను ఆర్డర్‌ పెట్టాడు. ఆర్డర్ పెట్టగానే అమౌంట్ కట్ అయినప్పటికీ.. ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు స్టేట‌స్‌లో కనిపించింది. అంతటితో ఆగకుండా మళ్ళీ ఆర్డర్ పెట్టాడు.. మళ్ళీ అదే అనుభవం ఎదురైంది.

ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందనుకున్న ప్రణయ్‌ లోయా ఇంటికి కొంత సమయానికే ఒక్కొక్కటిగా డెలివరీ వచ్చాయి. ఇలా ఒక్కో వస్తువు ఆరు సార్లు డెలివరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇది చూసి లోయా ఆశ్చర్యానికి గురయ్యాడు. తనకెదురైన ఈ వింత అనుభవాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. దీనికి ఎంత ఖర్చు అయిందనే విషయం స్పష్టంగా వెలుగులోకి రాలేదు.

ఇదీ చదవండి: చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ

అతడు డెలివరీ చేసుకున్న వాటిలో 20 లీటర్ల పాలు, 6 కేజీల దోశ పిండి, 6 ప్యాకెట్ల ఫైనాపిల్స్ ఉన్నట్లు సమాచారం. ఇన్ని ఎక్కువ సరుకులతో నేను ఏమి చేసుకోవాలి అంటూ ఎక్స్ ఖాతలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు