గూగుల్ కొత్త డొమైన్.. కొనాలంటే రూ. కోటి ఉండాల్సిందే.. ఎందుకింత ఖరీదు!

3 Nov, 2023 08:59 IST|Sakshi

Google New Domain: టెక్ దిగ్గజం గూగుల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఓ కొత్త డొమైన్ '.ing' ప్రారంభించింది. ఈ డొమైన్ అనే సింగిల్ వర్డ్ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. mak.ing నుంచి draw.ing వరకు వినియోగదారులు సులభంగా గుర్తించడానికి డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు.

గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం. .ing డొమైన్ రిజిస్టర్ చేసుకోవడానికి వన్-టైమ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చార్జీలు డిసెంబర్ 05 వరకు ప్రతి రోజూ తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ధరలు
ఏదైనా కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసుకోవడానికి ఇప్పుడు .ing అందుబాటులో ఉంటుంది. డొమైన్ స్టార్టింగ్ యాక్సిస్ కోటి రూపాయలు కావడం గమనార్హం. ఎందుకంటే ప్రస్తుతం ing ముగింపుతో వచ్చే పదాలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. think.ing రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 3249999, buy.ing రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 10833332.50 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

kin.ing, Dye.ing కోసం సంవత్సరానికి వరుసగా రూ.16249.17, రూ. 324999 చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్న సాధారణ డొమైన్స్ కంటే కూడా ఇవి చాలా ఖరీదైనవని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: 18 ఏళ్ల అనుభవం.. అయినా వదలని కంపెనీ - కష్టంలో టెక్ ఉద్యోగి

.ing డొమైన్‌ను పొందటం ఎలా?

  • GoDaddy, Namecheap లేదా Google Domains వంటి డొమైన్ రిజిస్ట్రార్‌కి వెళ్లి, మీకు కావలసిన .ing డొమైన్ కోసం సర్చ్ చేయాలి.
  • మీరు సర్చ్ చేసే డొమైన్ అందుబాటులో ఉంటే డబ్బు చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • డొమైన్ రిజిస్టర్ చేసిన తరువాత దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు.
  • ప్రస్తుతం .ing డొమైన్ ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంది. ఈ అవకాశం డిసెంబెర్ 5 వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు