గూగుల్‌ - యాపిల్‌ మధ్య భారీ డీల్‌.. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల పోరాటం ఫలించేనా?

27 Oct, 2023 08:19 IST|Sakshi

ఆన్‌లైన్‌ సెర్చింగ్‌ విభాగంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ యాంటీ ట్రస్ట్‌ కేసుల్ని ఎదుర్కొంటుంది. ఇతర సంస్థల్ని ఎదగనీయకుండా గూగుల్‌ గుత్తాదిపత్యం వహిస్తుందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతుంది.  ఓ వైపు ఆ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుండగా.. ఐఫోన్‌లలో డీపాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఉండేలా గూగుల్‌ మరో టెక్‌ దిగ్గజం యాపిల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక‍్కడ ఆసక్తికర విషయం ఏంటంటే?  

యాపిల్‌ వెబ్‌బ్రౌజర్‌ సఫారీలో డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా గూగుల్‌ ఉంచేందుకు గాను గూగుల్‌ యాజమాన్యం 10 బిలియన్‌ డాలర్ల నుంచి 20 బిలియన్‌ డాలర్ల మధ్య చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే న్యూయార్క్‌ టైమ్స్‌ మాత్రం ఆ డీల్‌ విలువ 18 బిలియన్‌ డాలర్లు అంటూ ఓ నివేదికను విడుదల చేసింది. 2021లో గూగుల్‌ ఈ మొత్తాన్ని యాపిల్‌కు చెల్లించిందని స్పష్టం చేసింది. 

స్పాట్‌లైట్‌తో పాటు సఫారీలో సైతం
రెండు దిగ్గజ టెక్‌ కంపెనీల మధ్య ఒప్పందం పూర్తయితే.. యాపిల్‌ సంస్థ తయారు చేసే ఐమాక్‌లలో స్పాట్‌లైట్‌ అనే ఫీచర్‌ ఉంది. ఆ ఫీచర్‌లో గూగుల్‌ సెర్చింజన్‌ ఆప్షన్‌ కనిపించడంతో పాటు, మనం ఏదైనా సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో.. అలాంటి ఫలితాలే యాపిల్‌ బ్రౌజర్‌ సఫారీ యూజర్లకు కనిపిస్తాయి. 
 
యాపిల్‌ భయపడుతోంది
ఐఫోన్‌ల కోసం తన సొంత వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా స్పాట్‌లైట్‌ వినియోగాన్ని తగ్గించే మార్గాల్ని గూగుల్‌ అన్వేషిస్తుంది. యాపిల్‌ సఫారీ బ్రౌజర్‌కి బదులు ఐఫోన్‌ యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను వినియోగించేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుంది. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల న్యూయార్క్‌ టైమ్స్‌(nyc)తో మరో విధంగా స్పందించారు. గూగుల్ తన సెర్చ్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై యాపిల్‌ ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. యాపిల్‌ యూజర్లు గూగుల్‌ క్రోమ్‌ని వినియోగించేలా గూగుల్‌ జీమెయిల్‌తో పాటు ఇతర సేవల్ని ఉపయోగించడంపై యాపిల్ భయపడుతుందని అర్ధం వచ్చేలా నాదెళ్ల వ్యాఖ్యలు చేశారు. 

మేం 15 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తాం
మేము (మైక్రోసాఫ్ట్‌) సైతం యాపిల్ డివైజ్‌లలో డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు సత్యనాదెళ్ల తెలిపారు. కానీ భారీ మొత్తంలో చెల్లించేందుకు తాము సంసిద్ధంగా లేమని న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాపిల్‌ డిఫాల్ట్ సెర్చ్‌ ఇంజిన్‌గా మారేందుకు మైక్రోసాఫ్ట్‌ 15 బిలియన్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉందని న్యూ యార్క్‌ టైమ్స్‌ నివేదిక హైలెట్‌ చేసింది.  

గూగుల్‌ పై సత్యనాదెళ్ల న్యాయపోరాటం
ఇక‍్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? గూగుల్‌ -  యాపిల్‌ మధ్య జరిగిన ఈ ఒప్పందం గతంలో యాపిల్‌- మైక్రోసాఫ్ట్‌ల మధ్య జరిగింది. కానీ గూగుల్‌ తన గుత్తాధిపత్యంతో మైక్రోసాఫ్ట్‌ను వద్దనుకుని తనతో పనిచేసేలా పావులు కదిపింది. చివరికి అనుకున్నది సాధించింది. మైక్రోసాఫ్ట్‌ను వద్దనుకున్న యాపిల్‌ .. గూగుల్‌తో జతకట్టింది. ఇప్పుడు ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల యూఎస్‌లోని ఓ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు.

అమెరికా ప్రభుత్వం, గూగుల్‌ మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్‌ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. సెర్చింజన్‌ మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని సత్య నాదెళ్ల ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్‌ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ,గూగుల్‌పై సత్యనాదెళ్ల చేస్తున్న న్యాయ పోరాటం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి.

చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!

మరిన్ని వార్తలు