టెక్‌ టమారం: ఇది వాషింగ్‌ మెషిన్‌..కాదు అంతకు మించి

11 Dec, 2022 10:01 IST|Sakshi

వాషింగ్‌ మెషిన్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! దుస్తుల మురికిని శ్రమలేకుండా వదలగొట్టే వాషింగ్‌ మెషిన్ల వాడకం సర్వసాధారణంగా మారింది. అయితే, వాషింగ్‌ మెషిన్ల తయారీలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. 

ఫొటోలో కనిపిస్తున్న వాషింగ్‌ మెషిన్‌. సాధారణ వాషింగ్‌ మెషిన్లకు మించి పనిచేస్తుంది. సింథటిక్‌ దుస్తులను ఉతికేటప్పుడు నీటితో పాటే కొట్టుకొచ్చే మైక్రోప్లాస్టిక్స్‌ను ఒడిసి పట్టుకుంటుంది. దుస్తులను ఉతకడం పూర్తయ్యాక, దీనిలోని ప్రత్యేకమైన మైక్రోప్లాస్టిక్‌ ఫిల్టర్‌లో చేరిన మైక్రోప్లాస్టిక్స్‌ వ్యర్థాలను తేలికగా వేరుచేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి డిటర్జెంట్లనైనా వాడుకోవచ్చు. 

బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన ‘గల్ప్‌’ కంపెనీ ఈ అధునాతన వాషింగ్‌ మెషిన్‌కు రూపకల్పన చేసింది. దీని ధర 250 పౌండ్లు (రూ.24,513). ప్రస్తుతం ఇది బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. 

మరిన్ని వార్తలు