Honda Cars Prices: పెరగనున్న హోండా కార్ల ధరలు

23 Aug, 2023 07:46 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా వచ్చే నెల నుంచి సిటీ, అమేజ్‌ కార్ల ధరలను పెంచనుంది. ముడిసరుకు వ్యయం క్రమంగా అధికం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ధర ఎంత పెంచేదీ  వెల్లడించలేదు.

ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ ధర రూ.7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మధ్యస్థాయి సెడాన్‌ సిటీ రూ.11.57 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక హైబ్రిడ్‌ మోడల్‌ అయిన సిటీ ఈ:హెచ్‌ఈవీ రూ.18.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు