Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ ఎలా ఛార్జ్‌ చేయాలో తెలుసా..!

24 Oct, 2021 13:23 IST|Sakshi

భారత ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల లాంచ్‌తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా దుమ్మురేపింది. రెండు రోజుల్లోనే రూ. 1100 కోట్ల విలువైన అమ్మకాలను ఓలా జరిపింది. మరికొద్ది రోజుల్లోనే ఓలా బైక్స్‌  రోడ్లపైకి రానున్నాయి.   

ఓలా బైక్‌ను ఎలా ఛార్జ్‌ చేయాలంటే..!
ఓలా బైక్లను బుక్‌ చేసుకున్న కొనుగోలుదారులకు నవంబర్‌ 10 నుంచి టెస్ట్‌ రైడ్‌ చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ ఓక ప్రకటనలో పేర్కొంది. అయితే తాజాగా ఓలా వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ ఓలా బైక్‌ను ఏవిధంగా ఛార్జ్‌ చేయాలనే విషయాన్ని తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. బైక్లను  ఓలా హైపర్‌చార్జింగ్‌ స్టేషన్‌ దగ్గర సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చునంటూ ఓ వీడియోను శనివారం రోజున ట్విటర్‌లో షేర్‌ చేశారు.ఈ వీడియోను సుమారు 18 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.
చదవండి: రెండు రోజుల్లో  రూ. 1100 కోట్లు   

ఓలా హైపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల సహయంతో ఓలా బైక్లను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చును. దేశవ్యాప్తంగా 400 నగరాల్లో సుమారు లక్షకు పైగా హైపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఓలా ఏర్పాటు చేయనుంది. ఈ హైపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల సహాయంతో బ్యాటరీలు కేవలం 18 నిమిషాల్లో 50 శాతం మేర ఛార్జ్‌ కానున్నట్లు కంపెనీ పేర్కొంది.  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీలను సులభంగా రిమూవ్‌ చేయవచ్చును. వీటి బరువు సుమారు 7 కిలోల వరకు ఉండనుంది. 

ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో ధర
ఓలా ఎస్‌1  ధర రూ.99,999 ఉండగా ఓలా ఎస్‌1 ప్రో ధర రూ.1,29,999 ఉంది. ఇక వాహనకొనుగోలు దారులకు ఫేమ్‌2 స్కీంలో భాగంగా సబ్సిడీతో పాటు, రాష్ట్రాల్ని బట్టి అదనపు సబ్సిడీ ఉండనుంది. 
చదవండి: ఓలా బైక్‌, నవంబర్‌ 10 నుంచి టెస్ట్‌ రైడ్స్‌ ప్రారంభం

మరిన్ని వార్తలు