ఎలాన్‌మస్క్‌ కుమారుడికి ఇండియన్‌ సైంటిస్ట్‌ పేరు

4 Nov, 2023 15:56 IST|Sakshi

ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ ఏం చేసినా సంచలనమే. వ్యాపార కార్యకలాపాలే కాకుండా వ్యక్తిగత వివరాలు వెల్లడించినా వైరల్‌గా మారడం ఖాయం. భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో బ్రిటన్‌లో జరిగిన సమావేశంలో ఎలాన్‌మస్క్‌ తన కుమారుడికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మస్క్‌, శివోన్‌ జిలిస్‌ దంపతుల కుమారుడికి భారతీయ పేరు నామకరణం చేసినట్లు చెప్పారు. 1983లో నోబెల్‌ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ పేరును తన కుమారుడికి నామకరణం చేస్తున్నట్లు మస్క్‌ దంపతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి తన ఎక్స్‌ ఖాతాలో పంచుకోవడంతో వైరల్‌ అయింది. 

ఇదీ చదవండి: ఆ ఫోన్‌ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్‌

ప్రొఫెసర్‌ ఎస్‌.చంద్ర శేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన నక్షత్రాల పరిణామం, వాటి నిర్మాణంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. కొన్ని నక్షత్రాలు కాలక్రమేణా వాటి శక్తిని కోల్పోయి కుచించుకుపోతాయి. అయితే నక్షత్రాలకు ఉంటే వివిధ లక్షణాలను అనుసరించి అవి ఏ రకమైన స్థితిలోకి వెళతాయో కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రశేఖర్‌ చేసిన పరిశోధనలకు గాను 1983లో విలియం ఏ.ఫ్లవర్‌తో కలిపి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆయనకు నివాళిగా తన కుమారుడిని ప్రేమగా శేఖర్ అని పిలుస్తామని మస్క్ భార్య శివొన్ జిలిస్ తెలిపారు. ఆమె కెనడియన్ వెంచర్ క్యాపిటలిస్ట్. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తి.

మరిన్ని వార్తలు