హువాయ్‌ ఫోన్లపై 100% తగ్గింపు.. ఆ చర్యకు సెటైర్‌గానే..!

25 Nov, 2021 10:02 IST|Sakshi

గ్లోబల్‌ మార్కెట్‌లో అమెరికా వర్సెస్‌ చైనా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కో రంగంలో పోటాపోటీ పైచేయితో దూసుకుపోతున్నాయి. అయితే చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు అమెరికా ఆంక్షలు, నిషేధాలకు సైతం వెనుకాడడం లేదు. ఈ తరుణంలో హువాయ్‌పై నిషేధం విధించిన విషయమూ తెలిసిందే. 


హువాయ్‌అమెరికా తాజాగా తన వెటకారాన్ని ప్రదర్శిచింది. బ్లాక్‌ ఫ్రైడ్‌ పేరుతో ఫోన్లపై 100 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది కంపెనీ. ఇది అమెరికన్లను మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అంటూ సోమవారం తన ట్విటర్‌ పేజీలో ఓ  పోస్ట్‌ కూడా చేసింది. అయితే అమెరికా నిషేధాన్ని నిరసిస్తూ ఈ రకంగా హువాయ్‌ సెటైర్లు వేసింది.

ఈ ట్వీట్‌కు విపరీతమైన లైకులు షేర్లు వచ్చాయి. దీంతో హువాయ్‌ మరో ట్వీట్‌ ద్వారా స్పందించింది. ఇదంతా జోక్‌అని, బ్లాక్‌ ఫ్రైడే సందర్భంగా తమ నుంచి ఎలాంటి అమ్మకాలు అమెరికాలో ఉండబోవని స్పష్టం చేసింది. ఇక నవంబర్‌ 26న బ్లాక్‌ ఫ్రైడే సందర్భంగా పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ, హువాయ్‌ మాత్రం ‘చిప్‌ ఆంక్షల’ కారణంగా నిషేధం ఎదుర్కొంటూ గమ్మున ఉండిపోయింది.

ఒకప్పుడు హువాయ్‌ ఉత్పత్తులు అమెరికా మార్కెటింగ్‌ వల్లే ప్రపంచం మొత్తంలో భారీగా అమ్ముడు పోయేవి. అయితే అమెరికా ఆంక్షలు, నిషేధం తర్వాత నుంచి భారీగా పతనం అవుతూ వస్తోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 32 శాతం అమ్మకాలు పడిపోగా, మొదటి అర్థభాగంలో 29.4 శాతం క్షీణత కనిపించింది.

మరిన్ని వార్తలు