‘ఇకాగో’..చాయ్‌ని చల్లారనివ్వదు

16 Oct, 2022 07:49 IST|Sakshi

పని చేసుకుంటూ టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటే! పనిలో నిమగ్నమైపోయి కొద్ది నిమిషాలు పక్కనే ఉంచిన టీ లేదా కాఫీని పట్టించుకోకపోతే, అవి చల్లారిపోతాయి. చల్లారిన చాయ్‌ లేదా కాఫీ అంతగా రుచించవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఇకాగో హీట్‌ కోస్టర్‌’ ఉంటే, అలాంటి సమస్య ఉండదు. ఎంతసేపైనా కప్పులో పోసిన పానీయం వేడిగానే ఉంటుంది.

ఇందులో విశేషం కప్పులో కాదు, దాని అడుగున ఉన్న స్మార్ట్‌ టేబుల్‌ టాప్‌ కోస్టర్‌లో ఉంది. చిన్న ట్రే సైజులో ఉండే దీనిని పనిచేసే చోట టేబుల్‌ మీద సులువుగా పెట్టేసుకోవచ్చు. దీని ప్లగ్‌ పెట్టుకుని, స్విచాన్‌ చేసుకుంటే చాలు. దీనిపైన పెట్టిన కప్పులోని టీ లేదా కాఫీ రెండు గంటల వరకు చల్లారిపోకుండా ఉంటాయి.

దీంతో మనం తాగాలనుకునే పానీయం వేడిని గరిష్ఠంగా 175 డిగ్రీల ఫారెన్‌హీట్‌ (79.4 సెల్సియస్‌) వరకు అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. రెండు గంటల తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయిపోతుంది. మళ్లీ వేడి చేసుకోవాలనుకుంటే, తిరిగి ఆన్‌ చేసుకుంటే సరిపోతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఇకాగో’కు చెందిన డిజైనర్లు దీనిని రూపొందించారు.  

మరిన్ని వార్తలు