WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి

19 Jan, 2024 01:42 IST|Sakshi

దేశీయంగా సోర్సింగ్‌ రెట్టింపు చేస్తాం

భారత మార్కెట్‌పై ఎయిర్‌బస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రెమీ మిలార్డ్‌

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్‌ రంగానికి భారత్‌ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రెమి మిలార్డ్‌ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్‌ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్‌ ఇండియా 2024 కార్యక్రమంలో  ఆయన చెప్పారు.

వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్‌ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్‌ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్‌ డాలర్లుగా ఉన్న సోర్సింగ్‌ను ఈ దశాబ్దం  చివరికి 1.5 బిలియన్‌ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు.

భారత్‌ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్‌కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్‌లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్‌లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్‌ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.   

వింగ్స్‌ ఇండియా హైలైట్స్‌
► హెరిటేజ్‌ ఏవియేషన్‌
ఎయిర్‌క్రాఫ్ట్‌ చార్టర్‌ కంపెనీ హెరిటేజ్‌ ఏవియేషన్‌ తాజాగా హెచ్‌125, హెచ్‌130 హెలికాప్టర్ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌ కింద
సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్‌ మాథుర్‌ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్‌125 హెలికాప్టర్‌ ఉపయోగపడుతుంది. ఇక సైట్‌ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్‌130 సహాయకరంగా ఉంటుంది.

► ఎయిర్‌ ఇండియా
గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్‌ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్‌ బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం 150 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది.

ఆకాశ ఎయిర్‌
బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం 150 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది.

ఎయిర్‌ ఇండియా
గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్‌ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ.

జీఎంఆర్‌ ఏరో
జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్‌ స్కూల్‌ వర్చువల్‌గా ప్రారంభం.

టీఏఎస్‌ఎల్‌
విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్‌తో కలిసి ఎయిర్‌బస్‌ నుంచి ఆర్డర్లను పొందింది.   

>
మరిన్ని వార్తలు