IndiGo:ఎయిర్‌బస్‌ నుంచి 500 విమానాలు ఆర్డర్‌

18 Feb, 2023 19:15 IST|Sakshi

సాక్షి,ముంబై:  ఎయిరిండియా మెగా డీల్‌ తరువాత దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో   వేగం  పెంచింది.  ఐరోపాలో తన పరిధిని విస్తరించేందుకు టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన భాగస్వామ్యాన్ని శుక్రవారం ప్రకటించింది.  ఇందుకోసం  యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్  నుండి  ఇప్పటికే ఆర్డర్‌ చేసిన 500 అదనపు విమానాలను అందుకోనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. 

ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇండియానుంచి  ఇస్తాంబుల్ ,ఐరోపాకు ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడంలో తమ తాజా కొనుగోలు సాయపడుతుందని  చెప్పారు. ఇండిగో  ప్రస్తుతం రోజుకు 1,800 విమానాలను నడుపుతోందని, వాటిలో 10 శాతం అంతర్జాతీయ రూట్లలో నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం ఇది మునుపెన్నడూ లేని విధంగా యూరప్‌లోకి చొచ్చుకుపోనున్నట్టు మల్హోత్రా అన్నారు.

భారతదేశం లోపల లేదా విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షించే ప్రయాణికులకు భారీ అవకాశం ఉంది. ప్రస్తుతం పాస్‌పోర్ట్ ఉన్నవారు దాదాపు 7.3 శాతం అంటే  100 మిలియన్ల కంటే  తక్కువ మంది ఉన్నారు. భారతీయ ప్రజలు పాస్‌పోర్ట్‌ను పొందుతున్నందున వారు చేయాలనుకుంటున్న మొదటి పని విదేశాలకు విమానంలో ప్రయాణించడమే. ఈ నేపథ్యంలోవారి ఆకాంక్షల్ని తీర్చేందుకు  సరియైన సమయమని భావిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు