ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్‌ చేయనున్న ఐఫోన్‌!

19 Mar, 2023 11:05 IST|Sakshi

ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ( iPhone 15 Pro Max) ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌ల ఫ్రంట్ గ్లాస్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందులో స్క్రీన్‌ బెజెల్‌ చాలా సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే స్క్రీన్‌కు చుట్టూ ఫోన్‌ ఫ్రేమ్‌కు మధ్య ఉన్న అంచును స్క్రీన్‌ బెజెల్‌ అని అంటారు.

ఇదీ చదవండి: యాపిల్‌ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!  

ఈ స్క్రీన్‌ బెజెల్‌ విషయంలో షావోమీ రికార్డ్‌ను ఐఫోన్‌ అధిగమించనుంది. షావోమీ (Xiaomi) 13 స్క్రీన్‌ బెజెల్‌ 1.81 ఎంఎం. ఇప్పటివరకూ ఇదే అతి సన్నని బెజెల్‌. ఇప్పుడు ఈ రికార్డ్‌ను యాపిల్‌ ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ బద్ధలుకొట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఫోన్‌ బెజెల్‌ వెడెల్పు 1.55 ఎంఎం ఉంటుందని టిప్‌స్టర్‌ ఒకరు ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఆల్వేస్ ఆన్, ప్రో మోషన్ వంటి డిస్‌ప్లే ఫీచర్లను యాపిల్‌.. రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే Wi-Fi 6E నెట్‌వర్క్‌ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుందని పుకారు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్ స్టేట్ బటన్‌లు, టైటానియం ఫ్రేమ్, అధిక ర్యామ్‌ వంటి కొత్త ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు