తొలి ట్వీట్‌ ఖరీదు రూ.18.30 కోట్లు!

7 Mar, 2021 14:56 IST|Sakshi

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన సంస్థే ట్విటర్‌. మరి ఈ ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ తొలిసారిగా ట్విట్ చేసిన ట్విట్ ఏంటో తెలుసా?. మార్చి 21, 2006లో తొలి సారిగా ‘‘జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌’’ అని జాక్‌ డోర్సీ పోస్టు చేశాడు. మరి ఇది అంత మీకు ఎందుకు చెబుతున్నాను అంటే. ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన ట్విటర్‌లో పెట్టిన తొలి ట్వీట్‌ను జాక్‌ డోర్సీ ‘వాల్యుయబుల్స్‌ బై సెంట్‌’ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని జాక్‌ డోర్సీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

డోర్సే 15 ఏళ్ల ట్వీట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటి వరకు ఉన్న అత్యంత ప్రసిద్ధ ట్వీట్లలో ఇది ఒకటి. ఇప్పటి వరకు లక్షల మంది ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దీనికి అందిన అత్యధిక ఆఫర్ 2.5మిలియన్ డాలర్లు(దాదాపు రూ.18.30 కోట్లు). 2.5మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చారు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్‌ సీఈవో డిజిటల్‌గా ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌ను పొందుతారు. ట్విటర్‌ సీఈవో సంతకాన్ని క్రిప్టోగ్రఫీని ఉపయోగించి సంతకం చేస్తారు. ఇందులో అసలు ట్వీట్ యొక్క మెటాడేటాతో పాటు అది పోస్ట్‌ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి.

చదవండి:

వాహనదారులకు కేంద్రం శుభవార్త!

మరిన్ని వార్తలు