మారుతీ సుజుకీకి భారీ నిధులు

29 Mar, 2022 08:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంస్థ జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో–ఆపరేషన్‌ (జేబీఐసీ) ఇప్పటి వరకు ఎస్‌బీఐకి రూ.11,400 కోట్లు సమకూర్చింది. ఈ మొత్తాన్ని మారుతీ సుజుకీ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఎస్‌బీఐ వినియోగిస్తోంది. మరో రూ.3,800 కోట్లు ఇచ్చేందుకూ జపాన్‌ సంస్థ సిద్ధమైంది. కోవిడ్‌ మహమ్మారి మొదలైన నాటి నుంచి దేశంలో సుమారు రూ.60,800 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్టు భారత్‌లో జేబీఐసీ కీలక ప్రతినిధి టొషిహికో కురిహరా తెలిపారు.

‘మారుతీ సుజుకీకి కావాల్సిన నిధులకై ఎస్‌బీఐకి రూ.15,200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 2020 నవంబర్‌–డిసెంబర్‌ మధ్య సగం మొత్తం సమకూర్చాం. అలాగే రూ.3,800 కోట్లు అందించాం. మిగిలిన రూ.3,800 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాం. భారత్‌లో ఉన్న జపాన్‌ సంస్థలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చేందుకు ముందున్నాం’ అని వివరించారు.   
 

మరిన్ని వార్తలు