సోనెట్‌ జాదూ ‘కియా’ దూకుడు మామూలుగా లేదుగా!

1 Jun, 2022 16:02 IST|Sakshi

సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా భారతీయ అనుబంధ సంస్థ కియా ఇండియా విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇండియాలో వార్షిక ప్రాతిపదికన 19 శాతం  వృద్ధిని సాధించింది. 2022, మే  నెలలోనే 18,718 యూనిట్లను విక్రయించింది కియా ఇండియా.

ఏప్రిల్ నెలలో  19,019 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే  పోలిస్తే ఇది కొంచెం తక్కువ. ఈ ఏడాదిలో మే నెలకు సంబంధించిన గణాంకాలను బుధవారం విడుదల  చేసింది.  తాజా  రికార్డు అమ్మకాలతో  దేశంలో ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌  కార్‌మేకర్‌ ఘనతను దక్కిచుకుంది.

ఈ విక్రయాల్లో అత్యధికంగా అమ్ముడు పోయిన కారుగా సోనెట్ నిలిచింది. 7,899 యూనిట్లను, సెల్టోస్ 5,953 , కేరెన్స్ 4,612 , కార్నివాల్ 239 యూనిట్లను విక్రయించింది. కాగా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీకార్ల సెగ్మెంట్‌లో 15 పూర్తి-ఎలక్ట్రిక్  కార్లను లాంచ్‌ చేయనుంది. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన పూర్తి-ఎలక్ట్రిక్, కియా ఈవీ6 మోడల్‌ను పరిచయం చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీబుకింగ్స్‌ ( మే 26, 2022)  ఇండియాలో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 97,796 యూనిట్లను విక్రయించింది.ఇది 19 శాతం పెరుగుదల. ముఖ్యంగా సోనెట్ లాంచ్‌ తర్వాత మొదటిసారిగా 1.5 లక్షల అమ్మకాలను సాధించిన సంస్థ గత నెలలో 4.5 లక్షల దేశీయ విక్రయాల మైలురాయిని అధిగమించింది.  అంతేకాదు ప్రస్తుతం దేశంలో ఐదవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమొబైల్ బ్రాండ్‌గా నిలిచింది కియా ఇండియా.  

అనేక సవాళ్ల మధ్య అమ్మకాల జోరును కొనసాగించడం సంతోషంగా ఉందని కియా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. రికార్డు టైంలో 4.5 లక్షల అమ్మకాలను సాధించాం. కియా బ్రాండ్‌పై భారతీయ కస్టమర్ల విశ్వాసాన్ని  తెలియజేస్తుందని కంపెనీ  ఒక  ప్రకటనలో వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు