రూ.20,000 కోట్లు సమీకరించిన రిలయన్స్‌

11 Nov, 2023 06:36 IST|Sakshi

7.79 రేటుపై బాండ్ల జారీ    

న్యూఢిల్లీ: భారీ వ్యాపార వృద్ధి ప్రణాళికలతో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు స్థాయిలో నిధులు సమీకరించింది. 7.79 శాతం రేటుపై పదేళ్ల కాల బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.20,000 కోట్లు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణ రేటు కంటే రిలయన్స్‌ 0.40 శాతం ఎక్కువ ఆఫర్‌ చేసింది.

20,00,000 సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను (ఎన్‌సీడీలు), రూ.1,00,000 ముఖ విలువపై ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ విధానంలో జారీ చేసినట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. కనీస ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు కాగా, స్పందన ఆధారంగా మరో రూ.  10,000 కోట్లను గ్రీన్‌ షూ ఆప్షన్‌ కింద రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిధుల సమీకరణ చేసింది. రిలయన్స్‌ బాండ్ల ఇష్యూకు మొత్తం రూ.27,115 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎన్‌సీడీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్నాయి.  

మరిన్ని వార్తలు