ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్

5 Dec, 2023 12:22 IST|Sakshi

భారతదేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్‌ఎ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌ వంటి వాటికి జరిమానాలు విధించింది. కాగా ఇప్పుడు మరిన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మకారిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నియమాలు డిసెంబర్ 04 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. 

సదరు బ్యాంకు వద్ద మూలధనం ఎక్కువగా లేకపోవడమే కాకుండా.. ఆదయ మార్గాలు కూడా లేకపోవడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్ రద్దు చేయడం జరిగింది.

నిబంధనలను అమలు చేయడంలో శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ విఫలం కావడం వల్ల.. కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇస్తే కస్టమర్లు ఇబ్బందిపడే అవకాశం ఉందని RBI భావించింది. ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్న వారికి తిరిగి చెల్లించే పరిస్థిలో ఈ బ్యాంక్ లేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు ఇన్ని రకాలా..! ఇవెలా ఉపయోగపడతాయంటే..?

ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిన ఆర్‌బీఐ లెక్కకు మించిన లైసెన్సులను రద్దు చేసింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ బ్యాంకులు ఉండటం గమనించదగ్గ విషయం.

>
మరిన్ని వార్తలు