ఇన్వెస్టర్లకు షాక్‌..నాలుగోవంతు సంపద మటాష్‌!

9 Jun, 2022 14:57 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) మార్కెట్ విలువ దారుణ స్థితికి చేరింది. మార్కెట్ వాల్యుయేషన్‌లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. విశ్లేషకుల అంచనాలకు, భయాలకు అనుగుణంగానే షేరు మరింత దిగజారి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అమ్మకాల ఒత్తిడితో ఎల్‌ఐసీ షేర్ ధర గురువారం మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐపీవో ఇష్యూ ధర 949 రూపాయలతో పోలిస్తే దాదాపు 25 శాతం కుప్పకూలింది. 

మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో  లిస్టింగ్‌ అయిన దగ్గరినుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడిన షేరు ధర ఆల్‌ టైం లో రూ.720 టచ్‌ చేసింది. ప్రస్తుతం 723.20 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్  6,00,242 కోట్లకు చేరింది. ఒక దశలోమార్కెట్ క్యాప్‌ దాదాపు 4.6 లక్షల కోట్లకు పడిపోయింది. దలాల్ స్ట్రీట్‌లో షేరు విలువ రూ. 1.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతోపెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. 

మరిన్ని వార్తలు