జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చేతికి మలేసియా సంస్థ వాటా

26 Oct, 2023 04:48 IST|Sakshi

11% వాటా కొనుగోలుకు రూ. 831 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాటాను 74 శాతానికి పెంచుకోనుంది. మలేసియా ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్‌ బెర్హాద్‌ (ఎంఏహెచ్‌బీ) నుంచి 11 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు జీఎంఆర్‌ 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 831 కోట్లు) వెచి్చంచనుంది. జీఎంఆర్‌ నేతృత్వంలో ఏర్పాటైన కన్సార్షియం.. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీఏఎల్‌)కు జీహెచ్‌ఐఏఎల్‌ అనుబంధ సంస్థకాగా.. ఎంఏహెచ్‌బీతో వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కీలక ఆస్తులను కన్సాలిడేట్‌ చేయడంలో భాగంగా తాజా వాటా కొనుగోలుకి తెరతీసినట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ తెలియజేసింది.  ప్రస్తుతం జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్‌కు 63 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు 13 శాతం చొప్పున వాటా ఉంది.

మరిన్ని వార్తలు