అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్

13 Dec, 2020 20:41 IST|Sakshi

లాటరీ అనే పదం మనకు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా మనకు లాటరీ తాకపోతుందా అని మనం కూడా ఎదురుచూస్తూ ఉంటాం. కానీ కొందరికి అదృష్టం ఉంటే ఒకటి లేదా రెండు సార్లు లాటరీ తాకుతుంది. కానీ, మనం ఇప్పుడు చెప్పబోయే అతనికి మాత్రం ఏకంగా 160 టికెట్లకు లాటరీ తగిలింది. దీనిని నమ్మడానికి కష్టాంగా ఉన్న ఇది నిజం. వర్జీనియా చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి డిసెంబర్ 5న నిర్వహించిన లాటరీ డ్రాలో 160 టికెట్లను కొన్నాడు. 1,3,4,7 అంకెలు కలిగి ఉన్న లాటరీలను కొన్నాడు. డిసెంబర్ 7న విడుదల చేసిన లాటరీ డ్రాలో తను కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగిలింది. (చదవండి: గూగుల్‌పై 73 లక్షల కోట్ల జరిమానా)


7314 కాంబినేషన్ తో ఉన్న ఎంచుకోవడానికి కారణం చెప్పాడు. అతను ఒక టీవీ షో చూస్తున్నప్పుడు 7314 నెంబర్ కి లాటరీ తాకే అవకాశం ఉందని చెప్పడంతో నేను అలానే చేశాను అని తను చెప్పాడు. తర్వాత తాను కొన్న ప్రతి లాటరీ తగిలిందని చెప్పడంతో చాల ఆశ్చర్యపోయాడు. ఇది కల నిజమా అని ఒకటి పది సార్లు చెక్ చేసుకున్నట్లు తెలిపాడు. అతను కొన్న 160 టికెట్ల బహుమతి విలువ మొత్తం $8,00,000 (రూ.5.89 కోట్లు). తను కొన్న ఒక్క టికెట్ అయిన లాటరీ తగిలితే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెడదామని అనుకున్నాని చెప్పాడు. మరి ఇప్పుడు ఏకంగా రూ.5.89 కోట్లు గెలవడంతో అతను సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఆ డబ్బుతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదని క్రాప్ చెప్పుకొచ్చాడు. కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగలడంతో ఇతనిని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో అని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఇలాగే ఒక సంఘటనలో రేమండ్ హారింగ్టన్ అనే వ్యక్తి 25 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి 25 సార్లు గెలిచి 1,25,000 డాలర్లు లభించాయి. 

మరిన్ని వార్తలు