‘వర్జీనియా’కు రికార్డు ధర

3 Sep, 2023 06:00 IST|Sakshi

జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్‌ఎల్‌ఎస్‌ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంది.

ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మ­కాలు జరిగాయి. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 55 మిలియన్‌ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరా­సరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడా­ది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది.

మరిన్ని వార్తలు