విషజ్వరాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా

13 Dec, 2020 20:16 IST|Sakshi

సాక్షి, విస్సన్నపేట: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో ప్రబలిన విష జ్వరాలపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని  ఆరా తీశారు. మండలంలోని కొండ పర్వం గ్రామంలో  కలుషిత నీరు కారణంగా ప్రబలిన విషజ్వరాలపై మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుండి ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండపర్వం గ్రామంలో పర్యటించి వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు (చదవండి: ఏలూరులో సాధారణ పరిస్థితి)

అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు భయపడొద్దని, విష జర్వాల నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టి డ్రైనేజీ పనులు చేపట్టాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. కొండపర్వంలో ప్రత్యేకంగా వైద్య బృందాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచామని  మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. (చదవండి: వీరవాసరం ఏఎస్‌ఐపై హత్యాయత్నం)

మరిన్ని వార్తలు