సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!

23 Dec, 2023 21:30 IST|Sakshi

ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంక్ నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేసారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల బెంగళూరులో 'చెన్నకేశవ' అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు రూ.38,000 పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. 

కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్దారించాడని ఒకటి నొక్కండి, లేకుంటే రెండు నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి ఒకటి నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేసాడు. కానీ మళ్ళీ ఓటీపీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు రూ. 38,720 ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు.

ఇదీ చదవండి: ఇలా ఎలా అనిపించిన ఓలా..

జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని Swiggy ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్లు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులను నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్విగ్గీ యూజర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

>
మరిన్ని వార్తలు