నేలచూపులతో మార్కెట్లు షురూ

26 Oct, 2020 09:36 IST|Sakshi

150 పాయింట్లు మైనస్‌- 40,536కు సెన్సెక్స్‌

50 పాయింట్ల నష్టంతో 11,880 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌

మెటల్‌, ఐటీ, బ్యాం‍కింగ్‌, రియల్టీ, మీడియా వీక్‌

స్వల్ప లాభాలతో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు

బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం ప్లస్‌

ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 40,536ను తాకింది. నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11,880 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో నిలవగా.. ఆసియాలో మిశ్రమ ధోరణి కనపిస్తోంది. గురువారం అక్టోబర్‌ ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఐటీ, రియల్టీ, బ్యాంకింగ్‌, మీడియా రంగాలు 1-0.5 శాతం మధ్య నీరసించగా.. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 0.2 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్‌ఐఎల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటో, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ 2.3-0.7 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, నెస్లే, ఎల్‌అంఢ్‌టీ, ఐషర్‌, ఐవోసీ, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, శ్రీసిమెంట్‌ 3.5-0.6 శాతం మధ్య ఎగశాయి.

కోఫోర్జ్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో కోఫోర్జ్‌, జిందాల్‌ స్టీల్‌, నౌకరీ, చోళమండలం, ఎస్కార్ట్స్‌, బయోకాన్‌, మణప్పురం, బంధన్‌ బ్యాంక్‌ 4.6-1.3 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. బీహెచ్‌ఈఎల్‌, వేదాంతా, అరబిందో, పెట్రోనెట్‌, ఐబీ హౌసింగ్‌ 3.4-1.2 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 932 లాభపడగా.. 670 నష్టాలతో కదులుతున్నాయి,

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు