నష్టాలతో మొదలై లాభాల్లోకి మార్కెట్లు

28 Oct, 2020 09:46 IST|Sakshi

స్వల్ప లాభాలతో కదులుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

బ్యాంకింగ్‌, మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ వీక్‌

ఐటీ, ఫార్మా, ఆటో, మీడియా రంగాలు ప్లస్

‌బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం అప్‌

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 69 పాయింట్లు పుంజుకుని 40,591కు చేరగా.. నిఫ్టీ 22 పాయింట్లు బలపడి 11,911 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,664 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,406 వద్ద కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 11,929- 11,858 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మంగళవారం యూఎస్‌ మార్కెట్లు అటూఇటూ అన్నట్లు ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో బలహీన ధోరణి కనిపిస్తోంది. గురువారం అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనున్న కారణంగా మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.5-0.2 శాతం మధ్య నీరసించగా.. ఐటీ, ఫార్మా, ఆటో, మీడియా 0.7-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌ 8 శాతం జంప్‌ చేయగా.. హీరో మోటో, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌, యూపీఎల్‌, దివీస్‌, టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌ 3-1 శాతం మధ్య పెరిగాయి. అయితే కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, అల్ట్రాటెక్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌ 2-0.4 శాతం​మధ్య బలహీనపడ్డాయి.

ఐడియా అప్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో వేదాంతా, ఐడియా, భారత్‌ ఫోర్జ్‌, ఎస్కార్ట్స్‌, జిందాల్‌ స్టీల్‌, వోల్టాస్‌, బాటా, బెర్జర్‌ పెయింట్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. శ్రీరామ్‌ ట్రాన్స్‌, జీ, ఎంఆర్‌ఎఫ్‌, అపోలో టైర్‌, డీఎల్‌ఎఫ్‌, భెల్‌, పీవీఆర్‌, అశోక్‌ లేలాండ్‌, అంబుజా, పెట్రోనెట్‌, పీఎఫ్‌సీ 2.3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం స్థాయిలో ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 978 లాభపడగా.. 646 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు