‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...

1 Apr, 2023 11:56 IST|Sakshi

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో 800 కారును ఇకపై కొనలేరు. ఎందుకంటే తన ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టో 800 ఉత్పత్తిని మారుతీ సుజుకీ నిలిపివేసింది. దీంతో మధ్యతరగతివారికి సైతం అందుబాటు ధరలో ఉంటూ అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ ఆల్టో 800 కారు కస్టమర్లకు దూరం కానుంది.

(వంట గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!)

బీఎస్‌6 (BS6) ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్‌గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని కంపెనీ భావిస్తోంది. దీంతో ఆ కార్ల ఉత్పత్తిని ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రోడ్డు ట్యాక్స్‌ పెరగడం, మెటీరియల్ ధర, ఇతర రకాల పన్నులు కూడా వాహనాల కొనుగోలు ఖర్చు పెరగడానికి కారణాలు. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక మరో కీలక అంశం ఆల్టో కె10కి డిమాండ్ పెరగడం.

ఆల్టో 800 ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ తగ్గుముఖం పడుతోందని, ఈ విభాగంలో వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

(Jio offer: జియో అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్‌.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్‌!)  

ఆల్టో 800 నిలిపివేత తర్వాత ఆల్టో K10 మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ మోడల్‌ కానుంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ 5.94 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకీ వెబ్‌సైట్ ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ 5.13 లక్షల మధ్య ఉంది.

2000 సంవత్సరంలో లాంచ్‌ అయిన ఆల్టో 800 కారులో 796 సీసీ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది.  2010 వరకు దాదాపు 18 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆల్టో K10 భారత మార్కెట్లో విడుదలైంది . 2010 నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఆల్టో 800 కార్లను, 9.5 లక్షల ఆల్టో K10 కార్లను కంపెనీ విక్రయించింది.

(విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్‌! గతి స్టూడెంట్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసెస్‌)

మరిన్ని వార్తలు