Maruti Suzuki: మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బ..! పడిపోయిన అమ్మకాలు..!

1 Dec, 2021 18:17 IST|Sakshi

కోవిడ్‌-19 రాకతో అనుకోని అతిథిలా వచ్చిన చిప్స్‌(సెమికండక్టర్స్‌) కొరత  ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఆయా కంపెనీల ఉత్పత్తి పడిపోవడంతో అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. చిప్స్‌ కొరతతో సతమతమవుతోన్న కంపెనీలో మారుతీ సుజుకీ కూడా చేరింది.

చిప్స్‌ కొరతతో ఉత్పత్తి అంతంతే..!
మారుతీ సుజుకీ ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 1,39,184 యూనిట్లను విక్రయించగా..గత ఏడాది నవంబర్‌ నెలలో 1,53,223 యూనిట్లను విక్రయించిన్నట్లు  మారుతి సుజుకీ ఒక  ప్రకటనలో పేర్కొంది. గ్లోబల్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మందగించడంతో అమ్మకాల్లో  9.16 శాతం  తగ్గుదల వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌ నెలలో  ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని కంపెనీ పేర్కొంది.గత నెలలో జరిగిన మొత్తం అమ్మకాలలో... దేశీయ విక్రయాల సంఖ్య 113,017 యూనిట్లుగా ఉండగా, ఇతర ఓఈఎమ్‌లకు 4774 యూనిట్లును విక్రయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. 
చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్‌..! కంపెనీకి కాసుల వర్షమే..!

మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌లో...అల్టో, ఎస్‌ ప్రెసో, బాలెనో, సెలెరియో, డిజైర్‌, ఈగ్నిస్‌,  స్విఫ్ట్‌, టూర్‌ ఎస్‌, వాగనార్‌ వంటి కార్లపై పలు ఆఫర్లను కలిగి ఉన్న  నవంబర్ 2021లో 74,492 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్‌ నెలలో  98,969 యూనిట్లను అమ్మకాలను జరిపింది.  మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ కార్ల విక్రయాలు 100,839 యూనిట్ల నుంచి 75,581 యూనిట్లుగా వరకు క్షీణించాయి.

యుటిలిటీ వాహనాల విభాగంలో అమ్మకాలు పరవాలేదనిపించింది. ఎర్టిగా, జిప్సీ, ఎస్‌-క్రాస్ , విటారా బ్రెజ్జా, ఎక్స్‌ఎల్‌ఆర్‌తో సహా గత నెలలో 24,574 యూనిట్లను విక్రయించింది.  మరోవైపు నాన్‌ కార్గో ప్యాసింజర్‌ ఈకో వ్యాన్ విక్రయాలు నవంబర్‌లో 9,571 యూనిట్లకు పడిపోయింది.  గత ఏడాది క్రితం నవంబర్‌ నెలలో 11,183 యూనిట్లను మారుతి విక్రయించింది. 
చదవండి: వినియోగంలో లేని బ్యాంక్‌ అకౌంట్లు, మగ్గుతున్న రూ.26,697 కోట్లు

మరిన్ని వార్తలు