వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..

18 Oct, 2023 08:37 IST|Sakshi

నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్‌(25) హైదరాబాద్‌లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సైదులు తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మద్యానికి బానిసై బలవన్మరణం
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

ముఖ్య గమని​క:
​​​​​​​ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు