Mega Comet: దూసుకువస్తోన్న భారీ తోక చుక్క..! భూమిని ఢీకొట్టనుందా? 

27 Sep, 2021 21:25 IST|Sakshi

భారీ తోక చుక్కగా గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు

తోకచుక్క అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది హేలీ తోకచుక్కనే. ఈ తోక చుక్క 1682లో కన్పించిన తోకచుక్కగా ఖగోళ శాస్త్రవేత్త హేలీ పేర్కొన్నారు. ఇది ప్రతి 75-76 ఏళ్లకొక సారి కన్పిస్తుంది. ఈ తోకచుక్క 1986లో కన్పించగా..మరలా 2061లో కన్పించనుంది. హేలీ తోక చుక్క కంటే భారీ తోక చుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.మన సౌరవ్యవస్థకు దగ్గరగా వస్తోన్న​ భారీ తోకచుక్కగా (కామెట్‌) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. 

మెగాకామెట్‌ను మొదట పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి , గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు  ఈ భారీ తోకచుక్కకు C/2014 UN271 అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ తోకచుక్క పరిమాణంలో అత్యంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిమాణంలో మార్స్‌ మూన్‌ పోబోస్‌, డిమోస్‌ కంటే పెద్గగా ఈ కామెట్‌ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాస్త్రవేత్తలు గుర్తించిన తోకచుక్కల్లో అతిపెద్ద తోకచుక్కగా నిలిచింది.

సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో కొనసాగుతున్న డార్క్ ఎనర్జీ సర్వే (DES) ద్వారా ఈ మెగా కామెట్ డేటాను పరీశిలిస్తున్నారు. తొలుత ఈ తోక చుక్కను ఒక ఆస్ట్రరాయిడ్‌గా గుర్తించగా..అబ్జర్వేటరీ అందించిన డేటా ప్రకారం అది తోకచుక్కఅని శాస్త్రవేత్తలు నిర్థారించారు.కామెట్ బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టెయిన్ మెగా కామెట్ పరిమాణం తొలుత 200 కిలోమీటర్ల వెడల్పుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.  

ఈ తోకచుక్క మనకు ఎప్పుడు దగ్గరగా వస్తుందంటే..? 
ఈ తోకచుక్క మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది.2031 సంవత్సరంలో మన సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

భూమిని ఢీకొట్టనుందా? 
ఈ తోకచుక్క అత్యంత పెద్దదిగా పరిగణించినప్పటికీ.. శాస్త్రవేత్తలు ఈ తోకచుక్క గమనాన్ని ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, భూమికి ఈ తోకచుక్క నుంచి ఎటువంటి ముప్పు లేదని వెల్లడించారు. 
చదవండి: న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మరో నలుగురు!

మరిన్ని వార్తలు