బిల్ గేట్స్‌ను వెనక్కు నెట్టిన జుకర్‌బర్గ్

6 Feb, 2024 14:58 IST|Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పుల ఏర్పడ్డ తరువాత.. మెటా సీఈవో 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg) కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్‌ను వెనక్కు నెట్టారు. దీంతో జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.

మెటా స్టాక్ ధరలు 22 శాతం పెరగడం వల్ల జుకర్‌బర్గ్ సంపద 28 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈయన నికర విలువ.. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 170 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ 145 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్‌బర్గ్ విలువ 25 బిలియన్ డాలర్లు పెరిగింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు జుకర్‌బర్గ్ కంటే ముందున్న ధనవంతులు బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ మాత్రమే ఉన్నారు. మెటా తన మొట్టమొదటి డివిడెండ్‌ను మార్చిలో పంపిణీ చేసినప్పుడు జుకర్‌బర్గ్ సుమారుగా 174 మిలియన్ డాలర్ల నగదును పొందవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్..

జుకర్‌బర్గ్ దాదాపు 350 మిలియన్ క్లాస్ A, B షేర్లకు యజమానిగా కంపెనీలో వాటాలను కలిగి ఉన్నారు. అయితే మెటా తన 50-సెంట్స్ త్రైమాసిక డివిడెండ్ కొనసాగిస్తే.. జుకర్‌బర్గ్ వార్షిక ఆదాయాలు 690 మిలియన్ డాలర్లకు మించిపోతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ధనవంతుల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న మెటా సీఈఓ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega