మీరు పీడీఎఫ్ ఫైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ.2,724 విలువైన మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ జూలై 3 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొనాలంటే మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ కోసం రూ.2,724(36.56 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల మైక్రోసాఫ్ట్ యూజర్లు జూలై 3 వరకు పీడీఎఫ్ మేనేజర్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది.
ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు భాగ ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పీడీఎఫ్ ఫైల్స్‌ని మెర్జ్, రీఆర్డర్, స్ప్లిట్, ఎడిటింగ్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ టూల్ ఉపయోగించి ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. రొటేట్, డిలిట్ కూడా చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎలా డౌన్లోడ్ ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఎలా?