హైదరాబాద్‌లో ‘స్వదేశ్‌స్టోర్‌’.. ప్రారంభించిన నీతా అంబానీ

8 Nov, 2023 19:29 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో రిలయన్స్ స్వదేశ్ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ చెప్పారు.  

ఈ సందర్భంగా ‘కళాకారులకు అవకాశం కల్పించడమే స్వదేశ్ స్టోర్‌ల లక్ష్యం.హైదరాబాద్ అంటే మాకు చాలా ఇష్టం. మా మొట్టమొదటి రిలయన్స్ రిటైల్ స్టోర్‌ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ముంబై ఇండియన్స్ కూడా ఇక్కడ రెండు టైటిల్స్ గెలిచారని’ నీతా అంబానీ అన్నారు. ఇక, స్వేదేశ్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి రాంచరణ్, ఉపాసన, మంచు లక్ష్మి, పీవీ సింధు, సానియా మీర్జాతో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.  

హస్తకళలకు అండగా 
దేశంలోని హస్తకళాకారులకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు భారతీయ కళలను పరిచయం చేసేలా ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆ సంస్థ హస్తకళల బ్రాండ్‌ ‘స్వదేశ్‌’ పేరుతో దేశ వ్యాప్తంగా స్టోర్‌లను ప్రారంభిస్తుంది.

ఈ స్టోర్‌లలో కళాకారులు చేతితో తయారు చేసిన వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తుల వారి నుంచి నేరుగా రిలయన్స్‌ సేకరిస్తుంది. ఈ స్టోర్‌లలో ప్రదర్శిస్తుంది. ఆపై  భారతీయ చేతివృత్తులవారిని, సెల్లర్లను ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు స్వదేశ్ బ్రాండ్‌తో ఈ కళాఖండాలను అందిస్తుంది రిలయన్స్ రీటైల్.

రైస్‌ కేంద్రాల ఏర్పాటు
దేశ వ్యాప్తంగా కళాకారులు ఏ మూలన ఉన్న వారిని గుర్తించేలా రిలయన్స్‌ స్వదేశ్‌ కేంద్రాలు గుర్తిస్తున్నాయి. వారిలో నైపుణ్యాలు మరింత పెంపొందేలా రిలయన్స్ ఫౌండేషన్ ఇన్ఫియేటీవ్‌ ఫర్ స్కిల్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ (RiSE) కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది రిలయన్స్‌  
 

మరిన్ని వార్తలు