హిందీలో 'హర్ సర్కిల్' ప్లాట్‌ఫామ్‌ను లాంఛ్ చేసిన నీతా అంబానీ

8 Mar, 2022 21:06 IST|Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ 'హర్ సర్కిల్'ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ హిందీలో లాంఛ్ చేశారు. దీంతో హర్ సర్కిల్ యాప్ హిందీలో కూడా అందుబాటులోకి ఉండనుంది. మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ’హర్‌ సర్కిల్‌’ పేరిట సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా వేదికను తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. 

ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్‌ మొదలైనవి హర్‌ సర్కిల్‌ సబ్‌స్క్రయిబర్స్‌కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో వేగంగా వృద్ధిలోకి వస్తున్న ప్లాట్‌ఫామ్ కావడం విశేషం. ఓవరాల్ రీచ్ 42 మిలియన్లు అంటే 4.2 కోట్లు కావడం విశేషం. హర్ సర్కిల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ హిందీ భాషలో అందుబాటులోకి వచ్చింది.

మా నెట్వర్క్ ఆస్పత్రి అయిన సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు 24 గంటల పాటు మెంటల్ వెల్‌నెస్, ఫిజికల్ ఫిట్‌నెస్, స్కిన్ కేర్, గైనకాలజికల్, కౌన్సిలింగ్ లాంటి అనేక అంశాల్లో ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో వేలాది మంది మహిళలు లాభపడుతున్నారు. ఫిట్‌నెస్, న్యూట్రిషన్, పీరియడ్స్, ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, ఫైనాన్స్ లాంటివాటికోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాకర్‌లను 1.50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉచితంగా ఉపయోగిస్తున్నారు.

(చదవండి: ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్ధిక సహాయం)

మరిన్ని వార్తలు