‘నాకు చావంటే భయం లేదు’.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!, ఆయన మాటల్లో మర్మం అదేనా!

12 Dec, 2023 19:09 IST|Sakshi

అమెరికన్‌ బిజినెస్‌ టైకూన్‌ ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కొంత మంది ప్రాణం పోతుందంటే భయపడ్తారు. నాకు చావంటే భయం లేదు.’’ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బిజినెస్‌ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అంతేకాదు అమెరికా ప్రభుత్వం నా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌.కామ్‌పై ఆంక్షలు విధిస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మస్క్‌ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేంతం

కాన్స్పరెసి థియరిస్ట్‌ (Conspiracy theorist) అలెక్స్ జోన్స్ 2012లో శాండీ హుక్‌ స్కూల్ కాల్పుల ఘటనపై తప్పుడు ప్రచారం చేశారు. ఆ సమయంలో అలెక్స్‌ చేసిన వ్యాఖ్యలు తమ సంస్థ పాలసీలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 2018లో ట్విటర్‌ (ఎక్స్‌.కామ్‌) ఆయన అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. 

గత ఏడాది ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అలెక్స్‌ జోన్స్‌ ట్విటర్‌ అకౌంట్‌ను రీఓపెన్‌ చేస్తారా? అన్న ప్రశ్నలు లేవనెత్తడంపై మస్క్‌ స్పందించారు. 

వ్యూస్‌ కోసం ఎంతకైనా తెగిస్తారు
‘‘జోన్స్‌ యూజర్ల కోసం, వారి నుంచి వచ్చే వ్యూస్‌ కోసం ఎంతకైనా తెగిస్తారు. తన ఇన్ఫోవార్స్‌ వెబ్‌సైట్‌, య్యూట్యూబ్‌, ట్విటర్‌లో యూజర్లను సంపాదించేందుకు శాండీ హుక్‌ స్కూల్‌ పిల్లల మరణాలను జోన్స్ ఉపయోగించుకున్నారని’’ మస్క్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్స్‌ ట్విటర్‌ అకౌంట్‌ను తిరిగి ఓపెన్‌ చేసేందుకు నిరాకరించారు. 

ముందు ట్రంప్‌.. ఆ తర్వాత జోన్స్‌ అకౌంట్‌
ఈ నేపథ్యంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్లాక్‌ చేసిన ట్విటర్‌ అకౌంట్‌ను అన్‌బ్లాక్‌ చేశారు. సరిగ్గా నెల రోజుల తర్వాత గత శనివారం అలెక్స్‌ జోన్స్‌ ట్విటర్‌ అకౌంట్‌ను పునప్రారంభించాలా? వద్దా? అంటూ ఎక్స్‌. కామ్‌లో ఓ పోల్‌ పెట్టాడు మస్క్‌. మస్క్‌ పెట్టిన పోల్‌ను వీడియో తీసిన జోన్స్‌.. తన ట్విటర్‌ అకౌంట్‌పై నిషేధం ఎత్తివేసేలా తనకు అనుకూలంగా ఓటు వేయమని తన సపోర్టర్లకు పిలుపునిచ్చారు. పోల్‌ ముగిసిన కొన్ని గంటల తర్వాత  ఇప్పుడు డిసెంబర్‌ 10న అదే బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న జోన్స్‌ అకౌంట్‌ను ఎక్స్‌.కామ్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ తిరిగి వినియోగించుకునేలా అనుమతి ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చర్చా వేదికలో మస్క్‌ మరణంపై
రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి ‘ఎక్స్ స్పేస్‌’ అనే ఆన్‌లైన్‌ చర్చా వేదికలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్షర్ మారియో నౌఫల్‌ దీన్ని నిర్వహించారు. ఈ లైవ్‌ ఆడియో చర్చా వేదికలో పాల్గొన్న మస్క్‌ను ఉద్దేశిస్తూ జోన్స్‌ ఇలా అన్నారు. 

జాన్‌ కెన్నెడీని హత్య చేసినట్లు
‘‘మస్క్‌ 43ఏళ్ల వయస్సులోనే అమెరికాకు 35వ అధ్యక్షుడైన జాన్ కెన్నెడీని హత్య చేసినట్లు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు గూఢాచార సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. వారు ఇప్పటికే ప్రణాళికలు, బ్లూప్రింట్‌లతో సిద్ధం ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్‌పై విషప్రయోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గట్టిగా చెప్పగలను. ట్రంప్‌ తర్వాత నువ్వే. నిన్ను చంపకపోవచ్చు. కానీ విష ప్రయోగం జరగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. 

చావా.. దానితో పెద్దగా పరిచయం లేదు
అందుకు జోన్స్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ జోన్స్‌ ‘‘కొంతమంది చనిపోవడానికి భయపడతారు. కానీ నేను అలా కాదు. నాకు చావంటే భయం లేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ అంశం వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతుండగా.. మస్క్‌కు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు