పట్టణాల్లో ప్రమాద ఘంటిక.. పెరుగుతున్న నిరుద్యోగం

1 Dec, 2021 11:12 IST|Sakshi

జనవరి - మార్చి త్రైమాసికంలో నిరుద్యోగ రేటు 9.3 %

ఎన్‌ఎస్‌వో సర్వే వెల్లడి 

న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 9.3 శాతానికి పెరిగినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. ఈ సంస్థ కాలానుగుణంగా సర్వే నిర్వహిస్తూ ఈ వివరాలను విడుదల చేస్తుంటుంది. 2020 జనవరి–మార్చిలో నిరుద్యోగ రేటు 9.1 శాతం ఉండడం గమనార్హం. పనిచేసే అర్హత ఉండీ, అవకాశాల్లేని వారు ఎంత మంది ఉన్నారనేది ఈ గణాంకాలు తెలియజేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైన వయసులోని వారికి సంబంధించి నిరుద్యోగ రేటు 2020 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 10.3 శాతంగా ఉండడం గమనార్హం. 
మహిళల్లో మరింత అధికం..  
ఇక 2021 మొదటి మూడు నెలల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగ రేటు 11.8 శాతానికి పెరిగింది. సరిగ్గా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 10.6 శాతంగాను, 2020 అక్టోబర్‌–డిసెంబర్‌లో 13.1 శాతంగాను ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏ మాత్రం మార్పు లేకుండా 8.6 శాతం వద్దే ఉంది. 2020 అక్టోబర్‌–డిసెంబర్‌లో ఇది 9.5 శాతంగా ఉండడం గమనార్హం.   
 

మరిన్ని వార్తలు