OCCRP సంచలన ఆరోపణలు: వేదాంతకు భారీ ఎదురుదెబ్బ

1 Sep, 2023 13:26 IST|Sakshi

మైనింగ్ దిగ్గజం వేదాంతకు భారీ షాక్‌ తగిలింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) అనిల్ అగర్వాల్‌ నేతృత్వంలోని కంపెనీలపై సంచలన ఆరోపణలు  చేసింది. గ్రీన్ నిబంధనలను బలహీనపరిచేందుకు లాబీయింగ్ ప్రచారాన్ని నడిపింది. అంతేకాదు వేదాందకు చెందిన చమురు సంస్థ కెయిర్న్ ఇండియా కూడా అక్రమాలను పాల్పడిందని జార్జ్ సొరోస్‌కు చెందిన ఓసీసీఆర్‌పీ పేర్కొంది. ప్రభుత్వ వేలంలో గెలిచిన చమురు బ్లాకులలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం పబ్లిక్ హియరింగ్‌లను రద్దు చేయడానికి విజయవంతంగా లాబీయింగ్ చేసిందని తెలిపింది.(మరో గుడ్‌ న్యూస్‌: భారీగా తగ్గిన గ్యాస్‌ ధర)

అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత  కొవిడ్ -19 మహమ్మారి సమయంలో కీలకమైన పర్యావరణ నిబంధనలను బలహీనపరిచే "కోవర్ట్" లాబీయింగ్ నడిపించినట్టు   తెలిపింది. మైనింగ్ కంపెనీలు 50శాతం వరకు ఉత్పత్తిని పెంచడానికి అనుమతించడం ద్వారా భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుందంటూ ప్రభుత్వానికి చెప్పిన వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తద్వారా కొన్ని నిబంధనలను ప్రభావితం చేసినట్టు ఆరోపించింది. అటు ఉత్పత్తి ,ఇటు ఆర్థిక వృద్ధిని తక్షణమే పెంచడమే కాకుండా, ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని, భారీ ఉద్యోగాలను సృష్టిస్తుందని అగర్వాల్ మంత్రికి చెప్పారని తెలిపింది. అలాగే దీన్ని 'ఒక సాధారణ నోటిఫికేషన్'తో మార్పు చేయవచ్చని సిఫార్సు చేశారని కూడా OCCRP వెల్లడించింది. 

అలాగే మోదీ సర్కార్‌ దీనిపై ప్రజల సంప్రదింపులు లేకుండానే..నిపుణులు చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించి మార్పులను ఆమోదించిందని తన కథనంలో పేర్కొంది ఈ మేరకు కొత్త పర్యావరణ అనుమతులు పొందుకు జనవరి 2021లో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాజీ పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో మాట్లాడారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే స్థానిక వ్యతిరేకత ఉన్నప్పటికీ కెయిర్న్ రాజస్థాన్‌లో ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులకు ఆమోదం పొందిందని  నివేదించింది.

కాగా గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై కూడా ఏసీసీఆర్‌పీ అనేక ఆరోపణలు చేసింది. అయితే వీటిని అదానీ గ్రూపు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆరోపణలపై వేదాంత ఎలా స్పందింస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు