‘70 గంటలు పనిచేయండి’..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై దారుణమైన ట్రోలింగ్‌

27 Oct, 2023 11:08 IST|Sakshi

దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని ట్రోల్‌ చేస్తున్నారు. కానీ, ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలతో  ఏకీభవించారు. 

ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌ దాస్‌ పై’ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నారాయణ మూర్తి భారతీయల పని సంసృ‍్కతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్‌ ఆర్ధిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చని వ్యాఖ్యానించారు. చైనా లాంటి దేశాలతో పోల్చినా దేశంలో పని గంటలు తక్కువని, ప్రపంచంలోనే అత్యల్పమని వివరించారు. ఇలా కాకుండా రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జపాన్‌, జర్మన్‌ ప్రజలు ఎలా విధులు నిర్వహించారో, అలా చేయాలని అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వాల్లోని అవినీతి, బ్యూరోక్రాట్స్‌ జాప్యం వంటి ఇతర సమస్యలను ప్రస్తావించారు. ‘‘ఉత్పాదకత విషయంలో భారత్‌ చాలా వెనుకబడి పోయింది. దీన్ని పెంచాలి. మెరుగుపరుచుకోకపోయినా, ప్రభుత్వంలో అవినీతిని ఏదో ఒక స్థాయిలో తగ్గించకపోయినా, అధికార యంత్రాంగం వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైనా మనం ఏమీ సాధించలేం. అద్భుతమైన పురోగతి సాధించిన దేశాలతో పోటీ పడలేం’ అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 

అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)లో పెద్ద దుమారమే చెలరేగింది. చాలామంది ఆయన వ్యాఖ్యలను ఖండించడం, విమర్శించడం చేశారు. కానీ... భవిష్‌ అగర్వాల్ మాత్రం మద్దతుగా మాట్లాడారు. ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం. తక్కువ పని చేసి మనల్ని మనం సమర్ధించుకోవడం కాదని ట్వీట్‌ చేశారు. 

మరోవైపు టెక్కీలు మాత్రం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడి అభిప్రాయాలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. 2005లో ఇన్ఫోసిస్‌లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతం ఏడాదికి రూ. 3.5 లక్షలుంటే 2023లోనూ అంతే ఇస్తున్నారని, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కేలా  రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తే .. అంచనాలకు మించి దాని కంటే 40 గంటలు అంకితభావంతో పనిచేస్తామని కొందరు ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లు మీరూ చేసేయండి.

మరిన్ని వార్తలు