-

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మీకు తిరుగులేదా? జీతం 83 కోట్లు!

27 Nov, 2023 19:46 IST|Sakshi

చాట్‌జీపీటీ విడుదలతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిపిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీకి డిమాండ్‌ భారీగా ఏర్పడింది. సోలో ప్రెన్యూర్‌ల నుంచి దిగ్గజ కంపెనీల వరకు ఏఐని వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ విభాగంలో నిష్ణాతులైన ఉద్యోగులకు ఆయా టెక్‌ కంపెనీలు పిలిచి మరీ ఉద్యోగాలిస్తున్నాయి.  

ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సంస్థ గూగుల్‌లో పనిచేస్తున్న ఏఐ ఎక్స్‌పర్ట్స్‌కు కళ్లు చెదిరేలా ఆఫర్‌ను అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, గూగుల్‌ నుంచి తమ సంస్థలోకి వచ్చే ఏఐ నిపుణులకు ఏడాదికి రూ. 83 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అంతేకాదు వారిని ఆకట్టుకునేలా  ప్రారంభ వేతనం 5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.41 కోట్ల 60 లక్షల) నుంచి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్లు) మధ్య జీతాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.  

లీడ్‌జీనియస్, పంక్స్ అండ్‌ పిన్‌స్ట్రిప్స్ డేటా ఆధారంగా ఓపెన్ఏఐ ఫిబ్రవరి నాటికి గూగుల్, మెటాలో పనిచేసిన మొత్తం 93 మందిని నియమించుకుంది. వీరిలో 59 మంది గూగుల్ నుంచి, 34 మంది మెటా నుంచి వచ్చారు. ఓపెన్ఏఐ సూపర్‌ అలైన్‌మెంట్ టీమ్‌లో పనిచేసే సిబ్బంది కోసం అన్వేషిస్తుంది.   

ఓపెన్‌ఏఐలో ఉద్యోగాలు 
ఓపెన్‌ఏఐలో చేరే ఉద్యోగులకు ప్యాకేజీలో భాగంగా శాలరీలు, కంపెనీలో వాటాతో పాటు ఇతర ప్రయోజనాల్ని అందిస్తుంది. ఏఐ భద్రత, విమర్శనాత్మక ఆలోచన, మెషిన్ లెర్నింగ్, కోడింగ్ ప్రావీణ్యం పట్ల మక్కువ ఉన్న రీసెర్చ్ ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు, మేనేజర్‌ పోస్ట్‌లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు