పదిహేను వేలకే ఒప్పో 5జీ మొబైల్

18 Dec, 2020 15:35 IST|Sakshi

ఒప్పో ఏ53 4జీ మొబైల్ నీ ఆగష్టులో లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా చైనాలో ఒప్పో ఏ53 5జీ వెర్షన్ మొబైల్ ని లాంచ్ చేసింది. 15వేలకే 5జీ మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లే ఉంది. వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ కూడా 90 హెర్ట్జ్‌గా ఉంది. ఒప్పో ఏ53 5జీ 4జీబీ + 128జీబీ వేరియెంట్ ధర జెడి.కామ్‌లో చైనా యువాన్లు1,299(సుమారు రూ.14,600). ఇది 6జీబీ + 128జీబీ వేరియెంట్‌లో కూడా లభిస్తుంది. భారత్ లో ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.(చదవండి: ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్)

ఒప్పో ఏ53 5జీ ఫీచర్స్ 
ఒప్పో ఏ53 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా కలర్‌ఓఎస్ 7.2పై పనిచేస్తుంది. ఇది 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్(1,080x2,400) పిక్సెల్స్ డిస్ప్లేని కలిగి ఉంది. ఒప్పో ఏ53 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ వేరియంట్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/2.2 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ఎఫ్/2.0 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చారు. 

ఒప్పో ఏ53 5జీలో 10వాట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,040 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని బరువు 175 గ్రాములగా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11ఎ/బి/జి/ఎన్/ఎసి, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్, గ్రావిటీ సెన్సార్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది లేక్ గ్రీన్, సీక్రెట్ నైట్ బ్లాక్, స్ట్రీమర్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 


 

మరిన్ని వార్తలు