పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్‌లో పడుతుందా?

4 Sep, 2023 21:11 IST|Sakshi

PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్‌ కార్డ్‌ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్‌ కార్డ్‌ చాలా అవసరం. ఈ పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్‌) పోయాయి. 

ఇప్పటికీ పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్‌ కార్డులు ఇనాపరేటివ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్‌ కార్డులున్నవారికి జీతం అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. 

(ఎస్‌బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...)

ఆధార్‌తో లింక్‌ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎ‍క్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు.

ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్‌.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్‌! ఆనంద్‌ మహీంద్రా ప్రశంస

మొదట ఉచితంగా పాన్‌-ఆధార్‌ లింకింగ్‌కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ కార్డులు ఇనాపరేటివ్‌గా మారిపోయాయి.

మరిన్ని వార్తలు