జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న పేటీఎం.. ఏకంగా నాలుగు రెట్లు

10 Jan, 2023 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రుణ వృద్ధి గత నెల నాలుగు రెట్లు ఎక్కువగా నమోదైంది. డిసెంబర్‌లో రూ. 3,665 కోట్లు విలువ చేసే 37 లక్షల రుణాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఇది 330 శాతం అధికమని పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తెలిపింది.

దీనితో డిసెంబర్‌ త్రైమాసికంలో మంజూరు చేసిన మొత్తం రుణాలు 357 శాతం పెరిగి రూ. 9,958 కోట్లకు చేరినట్లు వివరించింది. క్లిక్స్‌ క్యాపిటల్, పిరమల్‌ ఫైనాన్స్‌ వంటి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల భాగస్వామ్యంతో పేటీఎం తమ కస్టమర్లకు రుణాలు అందిస్తోంది.

చదవండి: నాలుగేళ్ల జీతం బోనస్‌ బొనాంజా: ఈ బంపర్‌ ఆఫర్‌ ఎక్కడ?

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు