200 కి.మీ రేంజ్‌లో కొత్త ఈ-స్కూటర్‌ : బుకింగ్స్‌ షురూ! ధర మాత్రం!

5 Oct, 2023 19:20 IST|Sakshi

ప్యూర్‌ ఈవీ ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్)

Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్‌ ఈవీ భారతదేశంలో  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది.  201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.  దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని  అందిస్తున్న  2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్  ఒకటిగా నిలిచింది.   ఈ వింటేజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్,  స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో  3.5 KWH బ్యాటరీని అమర్చింది.  స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది.  దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో  లభించనుంది.    (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు)

అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్  అప్‌గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా   తెలిసారు. మరోవైపు కంపెనీ  దాదాపు అన్ని ప్రముఖ నగరాలు,  పట్టణాలలో తన డీలర్ నెట్‌వర్క్‌ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్‌పాయింట్‌లను లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని వార్తలు