Railway Budget 2023: వందే భారత్‌ రైళ్లు, కేటాయింపులు, సామాన్యుడికి ఊరట!?

27 Jan, 2023 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ: 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కీలకమైన హల్వా వేడుక ముగిసింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, వేతన జీవులతో పాటు ఆర్థిక నిపుణులు,పెట్టుబడిదారులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇదే బడ్జెట్‌లో చేయనున్నారు.  ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ , మిజోరం మినహా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈశాన్య రాష్ట్రాలలో  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్‌  రైల్వే కేటాయింపులపై మరింత ఉత్కంఠ నెలకొంది. 

రైల్వే బడ్జెట్ ఒకపుడు విడిగా
2017 వరకు కూడా రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో కాకుండా విడిగా ప్రవేశపెట్టేవారు. 1924లో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.దేశంలో రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం నాటి బ్రిటిష్ పాలకులు రైల్వేకు ఎక్కువ నిధులు కేటాయించేది అప్పటి ప్రభుత్వం. ఇది సరకు రవాణాకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.  ఆ తరువాతి కాలంలో  ఏర్పాటైన  రైల్వే వ్యవస్థ జాతీయంపై 1920లో 10 మంది సభ్యుల సర్ విలియం అక్వర్త్ కమిటీ  రైల్వే వ్యవస్థను సంఘటితం చేయాలని  సూచించింది. అందుకోసం ప్రత్యేకంగా రైల్వేకు నిధులు కేటాయించాలని బ్రిటిష్ పాలకులకు సిఫార్సు చేసింది, దీనికి ఆమోదం లభించడంతో 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ని ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతోంది. దాదాపు 93 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సాంప్రదాయం కొనసాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపింది 2017లో తొలిసారిగా వార్షిక బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను ప్రకటించారు. 

అయితే తాజా బడ్జెట్‌లో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు,కేటాయింపులపై  తదితర విషయాలపై భారీ  ఆసక్తి నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వందే భారత్‌ రైళ్లు, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   రానున్న మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా సమాచారం మేరకు కేంద్రం ఈసారి రైల్వే బడ్జెట్ ను పెంచబోతోంది.  అలాగేప్రీ బడ్జెట్ మీటింగ్ రైల్వే బోర్డు తమకు 25 నుంచి 30 శాతం వరకూ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసింది.  ఈక్రమంలో రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌తో పోలిస్తే  వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో నూతన రైల్వే లైన్లను ప్రతిపాదనతోపాటు, ఆయా రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థలను మెరుగు పరిచేందుకుప్రాధాన్యత ఇవ్వనుంది.

అంచనాలు 
2023 బడ్జెట్  కేటాయింపుల్లో వేగవంతమైన రైళ్లకు అనుగుణంగా ట్రాక్స్‌ అప్‌గగ్రేడేషన్‌పై దృష్టి సారించాలని రైల్వే నిపుణులు చెబుతున్నారు. అధికంగా నిధులు, ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణం, లైన్ల గేజ్‌లు మార్పు, ఎలక్ట్రిఫికేషన్ చేయడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం లాంటివాటిపై  కసరత్తు  చేస్తున్నట్టు సమాచారం.

డిసెంబర్ 2023 నాటికి బ్రాడ్ గేజ్ రైల్వేల 100 శాతం విద్యుదీకరణ పూర్తి.
 మెట్రో రైల్వే వ్యవస్థను టైర్-2 నగరాలు , టైర్-1 నగరాల వెలుపలి ప్రాంతాలలో అభివృద్ధి 
 తద్వారా  భారతీయ రైల్వేలు 2030 నాటికి ప్రపంచంలోనే తొలి100 శాతం గ్రీన్ రైల్వే సర్వీస్‌గా అవిష్కారం
 హైపర్‌లూప్ టెక్నాలజీని అవలంబిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. 
► దీనితో పాటు  సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రాథమిక సౌకర్యాలపై భారీ ప్రకటన రానుందని అంచనా. 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4000 కి.మీ పొడవు లైన్ వేయడం ఉద్దేశ్యం
రాబోయే రైల్వే బడ్జెట్‌లో 7,000 కి.మీ బ్రాడ్ గేజ్ లైన్ విద్యుదీకరణప్రకటన 
► రైల్వే విజన్ 2024 ప్రాజెక్ట్ కింద, కొత్త ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌లు హై-స్పీడ్ ప్యాసింజర్ కారిడార్‌లను పరిచయం చేయడంతో పాటు, రద్దీ మార్గాల్లో మల్టీట్రాకింగ్ , సిగ్నలింగ్ అప్‌గ్రేడ్స్‌ లక్క్ష్యం.
► కోవిడ్ సమయంలో తొలగించిన రైల్వేలో సీనియర్ సిటిజన్ల కుల్పిస్తున్న 50 శాతం రాయితీని పునరుద్ధించాలని కూడా పలువురు కోరుతున్నారు

మరిన్ని వార్తలు