‘రషీద్ ఖాన్​కు రూ.10 కోట్లు రివార్డు’.. తప్పుడు కథనాల్ని నమ్మొద్దు.. రతన్ టాటా ట్వీట్‌

30 Oct, 2023 16:18 IST|Sakshi

ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌ టాటా ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్‌ రషిద్‌ ఖాన్‌కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్‌ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్‌ టాటా కొట్టిపారేశారు.

గత వారం ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్తాన్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.  డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్‌పై పంజా విసిరింది. పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్‌ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. 

అయితే, ఈ మ్యాచ్‌ విజయంతో ఆఫ్గాన్‌ క్రికెటర్‌ రషిద్‌ ఖాన్‌ ఇండియన్‌ ఫ్లాగ్‌ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్‌ ఖాన్‌కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్‌ టాటా..రషిద్‌ ఖాన్‌కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్‌ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి.   

ఆ కథనాల్ని రతన్‌ టాటా ఖండించారు. తనకు క్రికెట్​తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్‌కి రివార్డ్‌ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్‌ మెసేజ్‌లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్‌ టాటా నెటిజన్లను కోరారు.     

చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై..

మరిన్ని వార్తలు