భారీ ఉపశమన ప్యాకేజీ అంచనాలు: సూచీలకు బూస్ట్‌

5 May, 2021 09:45 IST|Sakshi

ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రసంగం

ఇన్వె‍స్టర్లు సెంటిమెంట్‌ బలం

5జీ ట్రయల్స్‌కు  టెల్కోలకు ట్రాయ్‌  గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక​ చెప్పాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ, మెటల్, ఆయిల్‌ రంగ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే  5జి ట్రయల్స్‌కు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాభపడుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌255 పాయింట్లు 48509  ఎగిసి వద్ద, నిఫ్టీ85 పాయింట్ల లాభంతో 14582 వద్ద   కొనసాగుతున్నాయి.  మరోవైపు ఈ రోజు  ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో ప్రసంగించనున్నారు. దీంతో మరోసారి భారీ  ఉపశమన ప్యాకేజీ లభించనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లలో సందడి నెలకొందని విశ్లేషకులు  భావిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు