అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్

18 Dec, 2023 21:02 IST|Sakshi

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా మండే మోటివేషన్ పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక చిన్న ఫాంటా బాటిల్ కనిపిస్తుంది. దాని చుట్టూ చేరిన రెండు తేనెటీగలు ఎంతో చాకచక్యంగా బాటిల్ మూతను తీసేయడం చూడవచ్చు. ఆ బాటిల్ మూట కొంచెం వదులుగా ఉండటంతో అవి రెండు చెరోవైపు తిప్పుతూ మూతను తీసేయం గమ్మత్తుగా అనిపిస్తుంది.

చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అథికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. టీమ్ వరకు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది, సక్సెస్ ఎప్పుడూ వ్యక్తిగత విజయంగా ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. జియో టీవీ బంప‌ర్ ఆఫ‌ర్

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోకి.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే తేనెటీగలను చూసి కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

>
మరిన్ని వార్తలు