బ్యాంకులకు ఆర్బీఐ షాక్‌ !

15 Nov, 2021 11:12 IST|Sakshi

వడ్డీ చెల్లిస్తే ‘స్టాండర్డ్‌’గా భావించవద్దు 

ఎన్‌పీఏలపై బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు  

ముంబై: మొండి బకాయిల (ఎన్‌పీఏలు) గుర్తింపు విషయంలో నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసింది. నిర్ణీత వ్యవధి వరకు రుణానికి సంబంధించి చెల్లింపులు చేయకపోతే నిబంధనల కింద ఆయా ఖాతాను ఎన్‌పీఏగా బ్యాంకులు ప్రకటించి, కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్‌పీఏ ఖాతాలకు సంబంధించి కేవలం వడ్డీ చెల్లింపులు వచ్చినంత మాత్రాన, వాటిని స్టాండర్డ్‌ ఖాతాలుగా మార్చొద్దంటూ ఆర్‌బీఐ తాజాగా బ్యాంకులను కోరింది. ఆయా ఖాతాల విషయంలో వడ్డీతోపాటు, అసలు చెల్లింపులు, వాటికి నిర్ణీత గడువులను పేర్కొనాల్సిందేనని తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.

కొన్ని బ్యాంకులు ఎన్‌పీఏల ఖాతాల విషయంలో కేవలం వడ్డీ చెల్లింపులను లేదా పాక్షిక వడ్డీ చెల్లింపులను స్వీకరించి స్టాండర్డ్‌ ఖాతాలుగా మారుస్తున్నట్టు ఆర్‌బీఐ దృష్టికి రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 
 

>
మరిన్ని వార్తలు