రియల్‌మీ10 ప్రొ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌, ధర తక్కువే!

17 Nov, 2022 19:09 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రియల్‌మి సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. చైనాలో రియల్‌మి 10 ప్రో సిరీస్‌ను కంపెనీ ఆవిష్కరించింది. రియల్‌మి ప్రొ, రియల్‌మి ప్రొ ప్లస్‌ 5జీ రెండు వేరియంట్లలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ఫోన్లను భారత మార్కెట్లో తీసుకొస్తామని స్పష్టం చేసింది.  ఇవి  స్టార్‌లైట్ గోల్డ్, నైట్ బ్లాక్, సీ బ్లూ రంగుల్లో  లభ్యం.

రియల్‌మి 10 ప్రో
6.7 అంగుళాల ఫుల్  హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 695 SoC, ఆండ్రాయిడ్ 13 
108+ 2 ఎంపీ రియర్‌ డ్యూయల్ కెమెరా
16ఎంపీ సెల్పీ కెమెరా
5000mAh బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

ధరలు:
8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సుమారు రూ. దాదాపు రూ. 18,300
12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 21,700

రియల్‌మి 10 ప్రో ప్లస్‌ 5జీ
6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 800నిట్స్ పీక్,
Snapdragon 695 SoC, ఆండ్రాయిడ్ 13
108+2 ఎంపీ  రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ 67 వాట్ ఛార్జింగ్

ధరలు
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 19,444
8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 22,900
12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 26,300

మరిన్ని వార్తలు